తెలంగాణలో ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో లక్ష కార్డులను అధికారులు పంపిణీ చేయనున్నారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు (New Ration Card Distribution). మార్చి 1న పంపిణీ చేయనున్న ప్రజాప్రభుత్వం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు. పదేండ్ల తర్వాత నెరవేరుతున్న పేద బిడ్డల కల అంటూ ట్వీట్ చేశారు.

కేసీఆర్ పార్టీని ఖ‌తం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, వీడియోలు ఇవిగో..

కాగా 2014 నుంచి తెలంగాణలో నూతన రేషన్ కార్డులు జారీ చేయలేదు.తాజాగా హైదరాబాద్‌‌- 285, వికారాబాద్‌ జిల్లా- 22 వేలు, నాగర్‌కర్నూల్‌ జిల్లా- 15 వేలు, నారాయణపేట జిల్లా- 12 వేలు, వనపర్తి జిల్లా- 6 వేలు, మహబూబ్‌నగర్‌ జిల్లా- 13 వేలు, గద్వాల్ జిల్లా- 13 వేలు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా- 6 వేలు, రంగారెడ్డి జిల్లా- 24 వేలు చొప్పున లక్ష కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చి 8 తర్వాత అన్ని జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

Minister Ponnam Prabhakar Tweet on New Ration Card distribution

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)