హైదరాబాద్లో పవన్ తో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీఓ1పై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా చంద్రబాబు సమాధానం చెప్పకుండా విసుగెత్తిపోయారు. మీడియాను మూకుమ్మడిగా దాడి చేసే అడవి కుక్కలతో పోల్చారు. బ్రిటీష్ పాలనలో కూడా కొందరు ఊడిగం చేశారని చెప్పుకొచ్చిన చంద్రబాబు..ఊర కుక్కల్లా మాట్లాడొద్దని వీడియోలో కనిపిస్తోంది. జర్నలిస్టులు అటూ-ఇటూ తాళాలు వేస్తున్నారని మీడియా ముఖంగా హేళన చేశారు. నిజంగానే జర్నలిస్టులకు దమ్ముంటే..ముందు వైఎస్ఆర్సీపీపై వ్యతిరేక కథనాలు రాసి తమను ప్రశ్నించాలని ఆర్డర్ వేశారు.ఈ వీడియోని వైసీపీ పార్టీ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

Here's YSRCP Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)