భార్యా భర్తల కేసులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్యజిల్లాలో భార్యభర్తల గొడవ కేసులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పుల్లంపేట పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి మాధురి తన భర్త శివప్రసాద్‌పై వేధింపుల కేసు పెట్టింది. దీంతో కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి ఫిర్యాదురాలి ఇంటి వద్దకు వెళ్లి శివప్రసాద్‌ను విచక్షణారహితంగా కొట్టడంతో ఒళ్లంతా కమిలిపోయి ఎర్రటి వాపులు ఏర్పడ్డాయి. దీంతో బాధితుడు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కన్నీరు పెడుతూ వేడుకుంటున్న తీరు అందరినీ కలిచివేస్తోంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్యకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ దారుణహత్యకు (Techie Brutally Killed by miscreants) గురయ్యాడు. కొనారి ప్రసాద్‌ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.

Constable Ramakrishna Reddy assaulted Man

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)