ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు గీతాంజలి మృతి చుటూ తిరుగుతున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు చేసిన ట్రోల్స్ వల్లనే గీతాంజలి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. గీతాంజలి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రాంతంలోనిది అంటూ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఎవరో అమ్మయిని రైలు కింద కి నెట్టేశారు. అవునా.. బ్రతికే ఉందా.. ఏమో.. తెలియదు. ఇంతకు ఆమెను తోసేసింది ఎవరు..? ఏమో తెల్వదు.. ఇద్దరు నెట్టేసి పారిపోయారు.. అని చర్చించుకోవడం ఆ వీడియోలో వినిపించింది.గీతాంజలిని రైలు కిందకు తోసేసింది ఎవరు.. నిజాలు బయటకు రావాలంటే టీడీపీ ప్రశ్నించింది. అయితే ఎక్కడో జరిగిన వీడియోకి ఆడియో మిక్సింగ్ చేశారంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో వేదికగా కౌంటర్ విసురుతున్నారు. గీతాంజలి మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక ఆత్మహత్య, ఎవరిని వదిలిపెట్టేది లేదని వెల్లడి
Here's TDP X Video
Sensational Video! #YSRCPExposed
గీతాంజలిని ఎవరు తోసేశారు?
వైసీపీకి ఉన్న లింక్ బయటకు రావాలి! #WhoKilledGeetanjali #YCPMurderPolitics #AndhraPradesh pic.twitter.com/HHBdrxmKhk
— Telugu Desam Party (@JaiTDP) March 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)