సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే 28 ఏళ్ల మహిళా ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 7వ తేదీన గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ వెల్లడించారు. మంగళవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యాయత్నం చేసిన గీతాంజలిని వెంటనే జీజీహెచ్‌కు తరలించినట్టు చెప్పారు. రైల్వే పోలీసులు ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. రైల్వే పోలీసుల దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా మనస్థాపానికి గురైందని తేలిందన్నారు.

రైల్వే పోలీసులు కేసును తెనాలి వన్‌టౌన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారని ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు. అక్కడ ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేశామన్నారు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. డిజిటల్ పుట్ ప్రింట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నామని, కొన్ని ఫేక్ ఐడిలు, కొన్ని ఒరిజినల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని, ఈ కేసులో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడీ పేర్కొన్నారు.  ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసు, అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు, నా భార్య మృతికి ట్రోలింగే కారణమన్న ఆమె భర్త

Here's Guntur SP Tushar Press Meet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)