శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని భక్తులు పట్టుకుని చితకబాదారు. క్యూ కంపార్టుమెంట్‌లో గురువారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సహాయ కార్యనిర్వాహక అధికారి జి.స్వాములు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటే ఏం చేస్తున్నారని భక్తులు ఆయన్ను నిలదీశారు. ఆలయ పవిత్రతను కాపాడటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో కామాంధుడుగా మారిన స్కూల్ కరస్పాండెంట్, రూం తలుపేసి చిన్నపిల్లలు బట్టలు విప్పి దారుణమైన వేధింపులు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Here's Video
నిన్న తిరుపతి నేడు శ్రీశైలం. మంట కలుస్తున్న హిండువుల దేవాలయాలు.
శ్రీశైలం ఆలయ క్యూలైన్లలో అపచారం, నిన్న రాత్రి మద్యం సేవించి విధుల్లో పాల్గొన్న క్యూలైన్ ఉద్యోగి, పట్టుకొని చితకబాదిన హిండువులు. ఈఓ స్వాములను నిలదీసిన భక్తులు, ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్.#SaveHinduTemples… pic.twitter.com/8ZZyP6Higf
— Aadhan Telugu (@AadhanTelugu) August 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)