Ex-Minister’s Driver Suicide: మాజీ హోం మంత్రి సుచరిత ఎస్కార్ట్ డ్రైవర్ ఆత్మహత్య
ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత నివాసం వద్ద ఆమె ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకుంది.
Vijayawada, Jan 24: ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత (Mekathoti Sucharitha) నివాసం వద్ద ఆమె ఎస్కార్ట్ డ్రైవర్ (Escort Driver) చెన్నకేశవరావు ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకుంది. గుంటూరు బ్రాడీపేట 4వ లైన్ లో సుచరిత ఇంటి సమీపంలో ఉన్న తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుచరిత నివాసానికి సమీపంలో ఓ హాస్టల్ లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే బలవన్మరణానికి కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చెన్నకేశవరావు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మాజీ హోం మంత్రి సుచరిత ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య
గుంటూరులోని సుచరిత ఇంట్లో గన్ తో కాల్చుకోని ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ చెన్నకేశవ రెడ్డి. మృతి పై వివరాలు సేకరిస్తున్న పోలీసులు. pic.twitter.com/ayjhM3hsZh
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 24, 2023 10:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

