టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లోని నివాసంలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. దర్శకుడు రాఘవేందర్ రావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ చిత్రంలో హీరోగా సుధీర్ వర్మ నటించారు. సెకండ్ హ్యాండ్, షూట్ఔట్ ఎట్ ఆలేరు చిత్రాల్లోనూ కనిపించారు.

నటుడి మృతిపట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సుధీర్ మృతి చెందిన విషయాన్ని ‘కుందనపు బొమ్మ’ సినిమాలో నటించిన సుధాకర్‌ కోమాకుల సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుధీర్‌ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని సుధాకర్ పేర్కొన్నారు.

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)