PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: వీడియో ఇదిగో, ఏపీలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం వైజాగ్‌లో పర్యటించారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్,గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు పలు పరిశ్రమలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు

PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: వీడియో ఇదిగో, ఏపీలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ
PM Modi Unveils Rs 2 Lakh Crore Projects

PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం వైజాగ్‌లో పర్యటించారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్,గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు పలు పరిశ్రమలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ. 85 వేల కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్ట్‌ 57 వేల మందికి ఉపాధి కలగనుంది. అనకాపల్లి జిల్లా పుడిమడకలో 1200 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం కానుంది.

రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ, తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన భారత ప్రధాని

నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని మోదీ చేతుల మీదగా శంకుస్థాపన జరిగింది. రెండు వేల ఎకరాల్లో రూ.1876 కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. 17 రాష్ట్రాలు పోటీ పడగా దక్షిణ భారతదేశం నుంచి ప్రాజెక్టు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 10 నుంచి 15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనుంది. దీంతో పాటు రైల్వే జోన్ భవనాలకు ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు.

PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).