విశాఖపట్నంలోని కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ చెత్త తగలబడటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో, కైలాసగిరిపై ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. విశాఖలోని కైలాసగిరిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం (Kailasagiri Fire Accident) జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అయితే, కైలాసగిరిపై వ్యాపారస్తులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు పర్యాటకులు చెబుతున్నారు. శుక్రవారం పాత టైర్లను తగలబెట్టడంతోనే మంటలు అంటుకున్నట్టు పలువురు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆరోపిస్తున్నారు. భద్రతను గాలికి వదిలేసినట్టు తెలిపారు.

హైదరాబాద్‌లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు, భారీగా ఆస్తి నష్టం, వీడియోలు ఇవిగో...

Major Fire Accident in Kailasagiri

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)