విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అగనంపూడి టోల్ గేట్ వద్ద బైక్ ని లారీ ఢీ కొట్టడంతో దంపతులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..పార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన గొర్లి మన్మధరావు(41), అరుణకుమారి(34) దంపతులు అగనంపూడి పరిధి కర్రివానిపాలెంలో నివాసం ఉంటున్నారు. మన్మధరావు ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు.
బ్యాంకు పనిమీద దంపతులిద్దరు ద్విచక్రవాహనంపై గాజువాక వెళుతుండగా అదే మార్గంలో వెనుక నుంచి టిప్పర్ లారీ (Vizag Road Accident) ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మరో ఘటనలో ఎన్ ఏ డీ ఫ్లై ఓవర్ వద్ద డైవెడర్ ని ఢీ కొట్టి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న వారికి గాయాలు అయ్యాయని సమాచారం.
Vizag Road Accident:
విశాఖలో రోడ్డు ప్రమాదాలు. అగనంపూడి టోల్ గేట్ వద్ద బైక్ ని లారీ ఢీ కొట్టడంతో స్పాట్ లో ఇద్దరు దుర్మరణం. ఎన్ ఏ డీ ఫ్లై ఓవర్ వద్ద డైవెడర్ ని ఢీ కొట్టి బోల్తా పడ్డ ఆటో.#AndhraPradesh #Visakhapatnam #TeluguNews #Vizag #VizagNews pic.twitter.com/7M6SNRe2kX
— Vizag News Man (@VizagNewsman) January 22, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)