టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు.
48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. విజయవాడ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని సమాచారం. కాగా వంగవీటి రాధా గుండెపోటు వార్త తెలుసుకున్న అభిమానులు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పలువురు ఆయన ఇంటికి వెళ్లి మరీ వివరాలు కనుక్కున్నారు. కాగా రాధా ఆరోగ్య పరిస్థితి గురించి రాజకీయ నాయకులు, మిత్రులు అడిగి తెలుసుకుంటున్నారు.
Here's News
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు.
ఈరోజు(గురువారం) తెల్లవారుజామున వంగవీటి రాధాకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధా డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన… pic.twitter.com/r5XtFwbyNG
— Aadhan Telugu (@AadhanTelugu) September 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)