Kothakota Dayakar Reddy Passes Away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత.. దయాకర్ రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం

మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.

Kothakota Dayakar Reddy Passes Away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత.. దయాకర్ రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం
Credits: Twitter

Hyderabad, June 13: మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి (Kothakota Dayakar Reddy) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని (Hyderabad) ఏఐజీ ఆసుపత్రిలో (AIG Hospital) చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. దయాకర్ మరణంపై సీఎం కేసీఆర్ (KCR), టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఇతర తెలంగాణ నేతలు, ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పర్కపురానికి చెందిన దయాకర్‌రెడ్డి మూడుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నియోజకవర్గానికి రెండు సార్లు, మక్తల్ నియోజకవర్గానికి ఒకసారి ప్రాతినిథ్యం వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.

Jharkhand Horror: రూ.10 అడిగాడని కుమారుడిని అంతమొందించిన తండ్రి.. ఝార్ఖండ్‌లోని ఛత్రాజిల్లాలో దారుణం

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 13, 2023 08:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).