Assembly Session Today: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్‌ ఒవైసీ

తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

Assembly Session Today: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు..  ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్‌ ఒవైసీ
AIMIM MLA Akbaruddin Owaisi (Credits: X (ANI))

Hyderabad, Dec 9: తెలంగాణ (Telangana) రాష్ట్ర మూడో శాసనసభ (Assembly Session) తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సభలో సీనియర్‌ ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్‌ ఒవైసీతో ఉదయం 8.30 గంటలకు స్పీకర్‌ ప్రొటెంగా రాజ్‌ భవన్‌ (Raj Bhavan) లో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. ఆ వెంటనే శాసనసభ నియమావళిని అనుసరించి ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

TS Ministers Portfolios Announced: భట్టికి ఆర్ధికం, ఉత్తమ్‌ కు నీటి పారుదల, శ్రీధర్‌బాబుకు ఐటీ, సీతక్కకు పంచాయతీ రాజ్‌.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. పూర్తి జాబితా ఇదిగో!

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 09, 2023 10:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).