Revanth Reddy(Photo0X)

Hyderabad, Dec 9: తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) మంత్రిత్వ శాఖలను కేటాయించారు. దీనికోసం నిన్న ఢిల్లీ (Delhi) వెళ్లిన ఆయన.. ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ప్రకటన చేశారు.

Firing Caught On Camera: ఎస్సై నిర్లక్ష్యంతో పొరపాటున పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకుపోయిన తూటా.. ఉత్తరప్రదేశ్‌ లో ఘటన.. పరారీలో ఉన్న ఎస్సై కోసం పోలీసుల గాలింపు (వీడియోతో)

మంత్రుల శాఖల వివరాలివే..

  • భట్టి విక్రమార్క - ఆర్థిక, ఇంధన శాఖ
  • తుమ్మల నాగేశ్వరరావు - వ్యవసాయం, చేనేత
  • జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్‌, పర్యాటకం
  • ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - నీటి పారుదల, పౌరసరఫరాలు
  • దామోదర రాజనర్సింహ - వైద్య, ఆరోగ్య శాఖ
  • కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - ఆర్‌ అండ్‌ బీ, సినిమాటోగ్రఫీ
  • దుద్దిళ్ల శ్రీధర్‌బాబు - ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు
  • పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
  • పొన్నం ప్రభాకర్‌ - రవాణా, బీసీ సంక్షేమం
  • సీతక్క - పంచాయతీ రాజ్‌, మహిళ, శిశు సంక్షేమం
  • కొండాసురేఖ - అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ