సలాం పోలీసన్నా. శివరాత్రి సందర్భంగా ఓ భక్తుడికి గుండెపోటు(Police Saves Life) రాగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఓ పోలీస్. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా వీణవంక మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ అనే భక్తుడు మహాశివరాత్రి సందర్భంగా ఓదెలలోని మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన భక్తుడికి గుండెపోటు(Heart Attack) రాగా.. అక్కడే ఉన్న పోత్కపల్లి ఎస్సై రమేశ్‌, పోలీసు సిబ్బంది వెంటనే సీపీఆర్‌(CPR) చేసి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్... రంగంలోకి ఎన్‌జీఆర్‌ఐ,బీఆర్ఐ నిపుణులు,8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు 

ఇక మరో వార్తను చూస్తే  SLBC టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొనగా 8 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.సహాయక చర్యల్లో భాగంగా నేడు ఆపరేషన్ మార్కోస్ నిర్వహించనున్నారు. NGRI, BRI నిపుణులు రంగంలోకి దిగనున్నారు. మట్టి, బురద, నీటి ప్రవాహంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Devotee Suffers Heart Attack; Police Save His Life with CPR

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)