Baby Dies in Stray Dogs Attack: హైదరాబాద్‌లో దారుణం, ఊయలో పడుకున్న 5 నెలల బాబుపై దాడి చేసిన వీధికుక్కలు, చికిత్స పొందుతూ బాబు మృతి

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో 5 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. వీధి కుక్కల దాడిలో గాయపడిన బాబును కాపాడేందుకు వైద్యులు 17 రోజుల పాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. నగరంలోని షేక్ పేటలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Baby Dies in Stray Dogs Attack: హైదరాబాద్‌లో దారుణం, ఊయలో పడుకున్న 5 నెలల బాబుపై దాడి చేసిన వీధికుక్కలు, చికిత్స పొందుతూ బాబు మృతి
Representational Image (Credits: Istock)

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో 5 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. వీధి కుక్కల దాడిలో గాయపడిన బాబును కాపాడేందుకు వైద్యులు 17 రోజుల పాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. నగరంలోని షేక్ పేటలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. షేక్ పేటలోని ఓ గుడిసెలో ఉంటున్న అనూష, అంజి దంపతుల 5 నెలల కొడుకు శరత్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ నెల 8న శరత్ ను ఊయలలో పడుకోబెట్టి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చాక బాబు గాయాలపాలై ఏడుస్తూ కనిపించాడు. దీంతో హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు నీలోఫర్ కు తీసుకెళ్లాలని సూచించారు. ఆపై నీలోఫర్ నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలుడిని కాపాడేందుకు వైద్యులు 17 రోజుల పాటు శ్రమించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం శరత్ కన్నుమూశాడు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 25, 2023 01:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).