Rains in Hyderabad: హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. పలు ప్రాంతాల్లో వర్షం.. తెలంగాణలోని ఇతర జిల్లాలకూ వర్షసూచన

కొన్ని రోజులు విరామాన్నిచ్చిన వరణుడు మళ్లీ హైదరాబాద్ పై విరుచుకుపడ్డాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Rains in Hyderabad: హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. పలు ప్రాంతాల్లో వర్షం.. తెలంగాణలోని ఇతర జిల్లాలకూ వర్షసూచన
Rains

Hyderabad, Aug 12: కొన్ని రోజులు విరామాన్నిచ్చిన వరణుడు మళ్లీ హైదరాబాద్ (Hyderabad) పై విరుచుకుపడ్డాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) పడుతుంది. ఇక తెలంగాణలోని (Telangana) పలు జిల్లాల్లో కూడా  వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు కురుస్తాయంది. నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, హనుమకొండ, కామారెడ్డి, వరంగల్, సూర్యపేట, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు నేడు ఏపీలో మోస్తారు వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Fire Accident in Hyderabad: చందానగర్‌ జేపీ సినిమాస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన ఐదు స్క్రీన్లు, ఫర్నీచర్‌

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 12, 2023 10:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).