Fire Accident in Hyderabad: చందానగర్ జేపీ సినిమాస్ లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన ఐదు స్క్రీన్లు, ఫర్నీచర్
హైదరాబాద్ లోని చందానగర్ (Chandanagar) జేపీ సినిమాస్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో చందానగర్‌లోని తపాడియా షాపింగ్ మాల్ ఐదో అంతస్థులో ఉన్న జేపీ సినిమాస్‌లో (JP Cinemas) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Hyderabad, Aug 12: హైదరాబాద్ లోని చందానగర్ (Chandanagar) జేపీ సినిమాస్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో చందానగర్‌లోని తపాడియా షాపింగ్ మాల్ ఐదో అంతస్థులో ఉన్న జేపీ సినిమాస్‌లో (JP Cinemas) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఐదు స్క్రీన్లు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కై లిఫ్టర్, నాలుగు ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
A major #fire erupted at #JPCinemas in #TapadiaMarutiInfinityMall, #Chandanagar this morning. Thankfully, no casualties have been reported within the building so far.#ChandanagarFire #SafetyFirst #hyderabadhttps://t.co/Ah09fwPFdT
— Telangana Today (@TelanganaToday) August 12, 2023
ఎన్‌వోసీ లేదన్న జీహెచ్ఎంసీ
షాపింగ్ మాల్ కు ఫైర్ ఎన్‌వోసీ లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 12, 2023 10:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

