సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో 7,8 అంతస్తుల్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.చుట్టుపక్కల పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఆ కాంప్లెక్స్‌లో 8 మంది వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. దట్టమైన పొగ అలుముకోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాంప్టెక్స్‌ లోపల పలు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ మంటలు 7,8 అంతస్తుల్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)