హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లై ఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్ పేట్ పీఎస్ పరిధిలోని చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కింద నిర్మాణ సామగ్రి ఉన్న షెడ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పాటుగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

వీడియోలు ఇవిగో, మంటల్లో తగలబడుతున్న అమెరికాలోని రెండు రాష్ట్రాలు, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా తీవ్రరూపం దాల్చిన కార్చిచ్చు

అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. దట్టమైన పొగతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, అంబర్‌పేట నూతన ఫ్లైఓవర్‌పై నుంచి రాకపోకలు ఫిబ్రవరి 26న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Major fire accident near Amberpet flyover 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)