అమెరికాలోని ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే అక్కడ వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్ర స్థాయిలో యత్నిస్తున్నారు. దక్షిణ కరోలినా రాష్ట్ర అటవీ సంరక్షణ విభాగం ప్రకారం.. ఇప్పటికే 4.9 చదరపు కిలోమీటర్ల మేరకు అటవీ భూమి మంటలకు ఆహుతి అయిపోయింది.తాజా సమాచారం ప్రకారం.. ఈ కార్చిచ్చులో ఎవరు గాయపడినట్లు, ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం లేదు.

మండే ఎండలతో వృద్ధాప్యం మరింత త్వరగా రావొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి

సౌత్‌ కరోలినాలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ హెన్రీ మెక్‌మాస్టర్‌ ప్రకటించారు. ఇక పరిస్థితిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తునట్లు వెల్లడించారు. మొత్తం 175 ప్రదేశాల్లో మంటలు వ్యాపించాయని వెల్లడించారు.నార్త్‌ కరోలినాలో నాలుగు వేర్వేరు అటవీప్రాంతాల్లో రేగిన కార్చిచ్చుతో 161 హెక్టార్లు దగ్ధమయ్యాయి. వీటిల్లో ఉవారీ నేషనల్‌ ఫారెస్ట్‌లో చెలరేగిన మంటలు అతిపెద్దవని అధికారులు చెబుతున్నారు.

Wildfires engulf North and South Carolina

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)