Temperature in Telangana (Credits: Twitter)

Newdelhi, Mar 3: ఎండలతో (Heatwaves) చర్మ సౌందర్యం, కాంతి తగ్గిపోతుందని తెలుసు. అయితే, అవే ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం (Heatwaves Could Age Humans Faster) మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది. ఎండల కారణంగా వృద్ధులపై పెను ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఎక్కువ కాలం తీవ్రమైన ఎండలకు గురైతే వృద్ధుల్లో వృద్ధాప్యం రెండేండ్లు ముందుగానే వేగవంతం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్రన్‌ కాలిఫోర్నియా పరిశోధకులు తెలిపారు. ఎండల వల్ల మిగతా వయస్కుల వారిపైన కూడా ప్రభావం చూపుతుందని, వాళ్ళలో కూడా ఏజ్ పెరుగొచ్చని తెలిపారు. అయితే, వృద్ధుల్లో ఈ పరిణామం ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. సుమారు 68 ఏండ్లు పైబడిన 3700 మందిని పరిశీలించాక వీరు ఈ విషయాన్ని వెల్లడించారు.

మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)

అందుకే..

ఎండల కారణంగా జీవ గడియారంలో మార్పులు వస్తాయని, 2.48 సంవత్సరాలు ముందుగానే వృద్ధాప్యం వస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్రన్‌ కాలిఫోర్నియా పరిశోధకులు గమనించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వేల మంది వృద్ధుల రక్త నమూనాల్లో ఎపిజెనిటిక్‌(జన్యు ప్రవర్తన) మార్పులను గమనించాక వారు ఈ విషయాన్ని వెల్లడించారు.

బెంగుళూరులో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రెండు BMTC బస్సుల మధ్య ఇరుక్కుపోయిన ఆటో, డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు మృతి