Representational Picture. Credits: Wikimedia Commons

Hyderabad, June 27: దేశంలో టమాటా (Tomato) మంట పెడుతున్నది. కిలో టమాటా ధర రూ.100 మార్కు దాటి కన్నీళ్లు తెప్పిస్తున్నది. నైరుతి రాకలో ఆలస్యం, పలుచోట్ల వర్షాలు (Rains) తక్కువగా పడుతుండటం, వడగాల్పులు (Heatwaves) ఇంకా తగ్గకపోవడంతో క్రమంగా టమాటాలు, పప్పు దినుసుల ధరలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈమారు టమాట సాగు తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది చిక్కుడుకు మంచి ధర పలకడంతో ఈమారు అనేక మంది ఈ పంటసాగువైపు మళ్లారు. దీనికి తోడు వర్షపాతం తక్కువగా ఉండటంతో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి.

ఈ రెండు కూరగాయలు మినహా..

ఉల్లి, బంగాళదుంప మినహా ఇతర కూరగాయల ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే కూరగాయల ధరలు సామాన్యులను ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. భోపాల్‌లో గతవారంతో పోలిస్తే కిలో టమాటా 10 రూపాయల మేర పెరిగి రూ.100కు చేరుకుంది.