
Newdelhi, Mar 3: యావత్తూ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల (2025 Oscar Awards LIVE) సంబురం ఎంతో వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ (Hollywood) ముఖ్య తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీనటులు ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్కార్ అవార్డుల వేడుకకు వచ్చిన గెస్టుల్లో నటి వ్యాఖ్యత అమేలియా డిమోల్డెన్ బర్గ్ చిట్ చాట్ చేశారు. కాగా 97వ అకాడెమీ అవార్డుల వేడుకను లైవ్ లో మీరూ చూడండి.
LIVE:
మనమూ గెలిచామోచ్
సినిమా రంగంలో అత్యున్నత అవార్డు ఆస్కార్ అవార్డు. దీనికే అకాడమీ అవార్డులు అని కూడా పేరు. ఈ ఆస్కార్ అందుకోవడం అనేది ప్రతీ నటుడు, ప్రతీ ఆర్టిస్ట్, ప్రతీ టెక్నీషియన్ కలగా ఉంటుంది. గత కొన్నేళ్ల నుంచి మన దేశం ఎక్కువగా ఈ ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతోంది. ది ఎలిఫెంట్ విష్ పర్స్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ఆస్కార్ అవార్డులను సాధించిన సంగతి తెలిసిందే. రెహమాన్ కు అయితే రెండు ఆస్కార్లు ఉన్నాయి. ఇక ఈ ఏడాది మన దేశానికి ఏదైనా సినిమాలో, ఫీచర్ ఫిల్మ్, డ్యాకుమెంటరీ ఫిల్మ్ ఇలా ఏదైనా ఓ కేటగిరీలో అవార్డు రాబడుతుందో లేదో చూడాలి.
ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న విజేతలు
- ఉత్తమ నటుడిగా.. అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
- ఉత్తమ దర్శకుడిగా.. సీన్ బేకర్ (అనోరా)
- ఉత్తమ నటిగా.. మైకీ మ్యాడిసన్ (అనోరా)
- ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కల్కిన్ ( ఏ రియల్ పెయిన్)
- ఉత్తమ సహాయనటి : జో సాల్దానా (ఎమిలియా పెరెజ్ చిత్రానికి గానూ)
- ఒరిజినల్ స్క్రీన్ ప్లే : అనోరా
- యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : ఫ్లో
- బెస్ట్ యానిమెటెడ్ షార్ట్ ఫిల్మ్ : ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్
- అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : కాన్ క్లేవ్
- క్యాస్టూమ్ డిజైనర్ : పాల్ తాజేవెల్ (విక్డ్)
- ఉత్తమ ఎడిటింగ్ : సీన్ బీకర్ (అనోరా)
- మేకప్, హెయిర్ స్టైలింగ్ : పియర్ ఒలివియర్ పర్సిన్, స్టీఫెన్ గులియన్, మారిలిన్ స్కార్సెల్లి (ది సబ్ స్టాన్స్ చిత్రానికి గానూ)
- ఒరిజినల్ సాంగ్ : ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ : విక్డ్
- బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : నో అదర్ ల్యాండ్