Hyderabad: ఏపీ ట్రాన్స్ జెండర్‌ను పెళ్లాడిన తెలంగాణ యువకుడు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ, తర్వాత ఏమైందంటే..
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్‌ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్ జెండర్)ను ఖమ్మం జిల్లాకు చెందిన లావూరి గణేష్ ప్రేమించాడు
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్‌ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్ జెండర్)ను ఖమ్మం జిల్లాకు చెందిన లావూరి గణేష్ ప్రేమించాడు. హైదరాబాద్‌లో వీరికి పరిచయమైంది, ఏడాది నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరు కలిసి అక్టోబర్ 29న నందిగామ ప్రాంతంలోని ఓ ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నట్లు వారు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న గణేష్ కుటుంబ సభ్యులు ఆదివారం నందిగామ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గణేష్, దీపును పోలీసులు పిలిపించారు.
తనకు దీపు అంటే ఇష్టమని, తనతోనే ఉండిపోతానని గణేష్ కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పడంతో వారు వెళ్లిపోయారు. పోలీసుల సమక్షంలో వారిద్దరు ఒక్కటైయ్యారు. వీరిద్దరూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు లవ్‌కి జండర్‌తో సంబంధం లేదని కామెంట్ చేశారు.

Here's Video
Love knows no gender or region: newly married couple Ganesh from #Khammam #Telangana & Deepu, transgender from #Nandigama #AndhraPradesh, met in #Hyderabad & fell in love one year ago; they got married one week ago & came to PS for protection as families opposed @ndtv @ndtvindia pic.twitter.com/cKiShVjbIO
— Uma Sudhir (@umasudhir) November 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 06, 2023 07:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

