Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ.. ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్
ఐపీఎల్ లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
Hyderabad, Mar 28: ఐపీఎల్ (IPL) లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma) అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో నీతా అంబానీ నిన్న హైదరాబాద్ వచ్చారు. మన నగరంలో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని మ్యాచ్ కు బయల్దేరడం ఆమెకు సెంటిమెంట్. ఈ క్రమంలోనే రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న నీతా అంబానీ దాదాపు 15 నిమిషాల పాటు అమ్మవారి సన్నిధిలో గడిపారు. అనంతరం ఉప్పల్ స్టేడియంకు వెళ్లారు.
https://t.co/FwK28v3Aub ఐపీఎల్ లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
— K Rajanna (@Rajanna83856570) March 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2024 08:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

