తెలంగాణలోని హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుషాయిగూడలో కన్న తండ్రిని కిరాతకంగా హతమార్చాడు కన్నకొడుకు. పట్టపగలు అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా పొడిచి పొడిచి చంపేశాడు(Son Brutally Kills His Father). దాదాపు 15 సార్లకు పైగా పొడవగా కనీసం ఒక్కరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు.

సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి, అతని కుమారుడు సాయి కుమార్ ఇద్దరూ కూడా ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌లో పని చేస్తున్నారు(ECIL). తండ్రి మొగిలి మద్యానికి బానిసై ప్రతి రోజూ ఇంట్లో గొడవకు దిగేవాడు. తాగి గొడవ చేయవద్దని కుమారుడు సాయికుమార్‌ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు.

బిర్యానీ తిని డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి.. లాలాగూడలో ఘటన, హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు, వీడియో ఇదిగో

దీంతో విసిగిపోయి తండ్రిని హతమార్చాలని నిర్ణయించుకున్న సాయి(Son Kills Father).. ఈసీఐఎల్‌ బస్‌ టెర్మినల్‌ వద్ద తండ్రి మెుగిలి బస్సు దిగగా అతడిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి. అయితే ఈ హత్యకు ఆస్తి తగాదాలు ఓ కారణమని తెలుస్తోంది.

Son Brutally Kills His Father in Hyderabad.. here are the details

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)