స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికతో వాట్సాప్‌లో చాట్ చేసిన 9వ తరగతి చదివే బాలుడు. గమనించి బాలుడిని బెదిరించిన బాలిక కుటుంబసభ్యులు.. భయపడి ఆత్మహత్య చేసుకున్న బాలుడు. వివరాల్లోకెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న మనోజ్(15) అనే బాలుడికి, తన స్కూల్లోనే ఏడవ తరగతి చదువుతున్న పల్లవితో చనువు ఏర్పడింది
రోజు మనోజ్, పల్లవితో వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాడు.. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు మనోజ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.
7వ తరగతి చదువుతున్న బాలికతో వాట్సాప్ ఛాట్ చేసిన 9వ తరగతి చదివే బాలుడు
ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్
స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికతో వాట్సాప్‌లో చాట్ చేసిన 9వ తరగతి చదివే బాలుడు
గమనించి బాలుడిని బెదిరించిన బాలిక కుటుంబసభ్యులు.. భయపడి ఆత్మహత్య చేసుకున్న బాలుడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాకు చెందిన తొమ్మిదో… pic.twitter.com/BOc0YWsD9t
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)