Lasya Nanditha Dies: సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే లాస్య నందిత మృతి, పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు, తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్ లోనే..
పటాన్ చెరు ఓఆర్‌ఆర్‌పై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక(ప్రాథమిక) బయటకు వచ్చింది. తలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్‌లోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది.
పటాన్ చెరు ఓఆర్‌ఆర్‌పై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక(ప్రాథమిక) బయటకు వచ్చింది. తలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్‌లోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. లాస్య నందిత శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. తై బోన్, రిబ్స్ ఫ్రాక్ఛర్ అయ్యాయి. ఆరు దంతాలు ఊడిపోయాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. మొత్తంగా.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఆమె మరణించారు’’ అని పోస్టుమార్టం నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు, ప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీస్ అధికారులు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతికి సంతాపం తెలిపిన పలువురు రాజకీయ నేతలు
Here's News
ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక విడుదల
సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడంతో తలకు బలమైన గాయాలు అవ్వడం వల్ల లాస్య నందిత స్పాట్‌లోనే మరణించింది.
తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి.. ఒక కాలు విరిగిపోయింది.. శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలో… pic.twitter.com/h5hFye7u9Y
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 23, 2024 03:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

