Telangana Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఇతర ప్రముఖ నేతలు, వీడియోలు ఇవిగో..
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో సినీ నటులు, ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పీఎం మోదీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్, రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత, కూతురు నైమిషాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
మోహన్‌బాబు, నాగచైతన్య, మంచు మనోజ్, విష్ణు, రాజమౌళి కుటుంబం ఓటు వేశారు. ఇక, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తన భార్యతో కలిసి సిద్దిపేటలోని అంబిటస్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోంది. 65 శాతానికి మించి పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.
Here's Videos
కొడంగల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. pic.twitter.com/898vgcbF45
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
సిద్దిపేట చింతమడకలో తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ pic.twitter.com/QVcWHfXSIC
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
ఖమ్మం జిల్లా మధిరలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క pic.twitter.com/yTn0ZgMqUN
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
నంది నగర్‌లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/bVxWFSYjPK
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి సీతక్క pic.twitter.com/n1eajDK9ku
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
కుటుంబంతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు pic.twitter.com/gzkraZfWtW
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
కరీంనగర్లో కుటుంబంతో కలిసి ఓటు వేసిన ఎంపీ బండిసంజయ్ pic.twitter.com/AVsqQL40nz
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు వేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి pic.twitter.com/vmU4iNi0d8
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 13, 2024 12:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

