Modi and Amit Shah (Photo-ANI)

తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా ట్వీట్స్ చేశారు. అసెంబ్లీ స‌హా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాల‌ని మోదీ పిలుపునిచ్చారు. మ‌రోవైపు తెలుగు సంస్కృతిని, గౌర‌వాన్ని కాపాడే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

"ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను. అలాగే నాలుగో ద‌శ‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా పోలింగ్ కొన‌సాగుతున్న అన్ని ప్రాంతాల్లోనూ ఓట‌ర్లు పెద్ద ఎత్తున్న త‌ర‌లి రావాలి. ప్రతిఒక్క‌రూ త‌మ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించి ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేయాలి" అని మోదీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  ప్రారంభమైన నాలుగో దశ పోలింగ్, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

"లోక్ సభ ఎన్నికల నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతోంది. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోవాలి. రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన పంజాల నుండి విముక్తి చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని అమిత్ షా ట్వీట్ చేశారు.

Here's Tweets

అటు తెలంగాణ‌లో జ‌రుగుతున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై కూడా ఈ సంద‌ర్భంగా అమిత్ షా ఓ ట్వీట్ చేశారు. "తెలంగాణలో నేడు నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించి, సుపరిపాలనను అందించే ప్ర‌భుత్వానికి ఓటు వేయాలి. వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపి, రైతుల సమస్యలపై శ్రద్ధ వహించేవారిని ఎన్నుకోండి. బుజ్జగింపులు, అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. అభివృద్ధి, సమాన అవకాశాలను అందించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అధిక లాభం చేకూరుతుంది" అని అమిత్ షా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.