New Delhi, May 13: సార్వత్రిక ఎన్నికల నాలోగుదశ ఎన్నికల పోలింగ్ ఉదయగం 7 గంటల నుంచి ప్రారంభమైంది.సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది. వీటితో పాటుగా ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, అదేవిధంగా ఒడిశాలో అసెంబ్లీకి తొలి దశలో భాగంగా 28 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతున్నది. దేశంలో 543 సీట్లు ఉండే లోక్‌సభలో ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో 283 స్థానాల్లో(52 శాతం) పోలింగ్ పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటరు మహాశయులు.. ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇతరత్రా ప్రముఖులు
96 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 17.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.73 కోట్ల మంది మహిళలు ఉన్నారు. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ, ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలో 13, బీహార్-5, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఒడిశా-4, పశ్చిమబెంగాల్-8, జమ్ముకశ్మీర్‌లో ఒక్క స్థానం చొప్పున సోమవారం పోలింగ్ జరుగుతోంది.జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.