Vij, December 25: 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ముగ్గురిని ఒక రాష్ట్రం నుండి మరో చోటికి బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది.
ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం రాత్రి పత్రికా ప్రకటన విడుదల చేసింది. వీడియో ఇదిగో, ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్, చింతలూరు వద్ద బస్సు ఆపి అందులో నిద్రపోతున్న సమయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా, విశాఖపట్నం ఎంపీగా పని చేశారు. 2021 నవంబరు 6న మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. సెప్టెంబరులో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొంది కోలుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఒడిశాకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.