ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారు.ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా. ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు.. ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు. శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు.. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, జగిత్యాలలో సంజయ్ రాకతో జీవన్ రెడ్డి అలక, రాజీనామాకు సిద్ధపడినట్లుగా వార్తలు, బుజ్జగించే పనిలో పెద్దలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)