Corona in TS: తెలంగాణలో కొత్తగా 111 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 29 కొత్త కేసులు నమోదు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 30,050 కరోనా పరీక్షలు నిర్వహించగా, 111 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 29 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 30,050 కరోనా పరీక్షలు నిర్వహించగా, 111 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 29 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. వనపర్తి, వికారాబాద్, సూర్యాపేట, నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూలు, ములుగు, మహబూబాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.అదే సమయంలో 187 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,68,833 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,60,917 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,979 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,937కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.16.10.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/vV6ZEzOpKy
— IPRDepartment (@IPRTelangana) October 16, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 17, 2021 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

