Corona in TS: తెలంగాణలో కొత్త‌గా 161 క‌రోనా కేసులు న‌మోదు, గత 24 గంటల్లో ఒకరు మృతి, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 50 కొత్త కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు నిర్వహించగా, 161 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 50 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు గుర్తించారు.

Corona in TS: తెలంగాణలో కొత్త‌గా 161 క‌రోనా కేసులు న‌మోదు, గత 24 గంటల్లో ఒకరు మృతి, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 50 కొత్త కేసులు
Coronavirus test (Photo-ANI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు నిర్వహించగా, 161 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 50 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు గుర్తించారు. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 174 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,933 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,750 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,967కి పెరిగింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 09, 2021 11:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).