Corona in TS: తెలంగాణలో కొత్తగా 183 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,354 కరోనా పరీక్షలు నిర్వహించగా, 183 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 20, ఖమ్మం జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,354 కరోనా పరీక్షలు నిర్వహించగా, 183 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 20, ఖమ్మం జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నారాయణపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 220 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,68,070 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,942 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,196 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,932కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.11.10.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/iCtdfYKeJ3
— IPRDepartment (@IPRTelangana) October 11, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 12, 2021 10:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

