ఖమ్మం జిల్లాలోని ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ (Mudigonda) గ్రామానికి చెందిన సాయివర్ధన్ (Saivardhan) కిష్టాపురం (Kistapuram) ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఇంటికి వెళ్లి వచ్చిన సాయివర్ధన్ కళాశాలలో రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కళాశాల సిబ్బంది సాయివర్ధన్‌ను ఆసుపత్రికి తరలించగా.. అతడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన జవాన్, రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుని మృతి
Suspicious death of Gurukula student
గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని కృష్ణాపురం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూ.కళాశాలలో ఇంటర్ విద్యార్థి మృతి..
తరగతి గదిలో విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన సాయి వర్ధన్ అనే విద్యార్థి..
విద్యార్థి మృతికి గల కారణాలను దర్యాప్తు… pic.twitter.com/cL6CiWAtVO
— News Line Telugu (@NewsLineTelugu) December 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)