Telangana: వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో పడిన యువతి, తాళ్ల సాయంతో ఆమెను పైకి లాగి కాపాడిన స్థానికులు

నల్గొండ జిల్లాలో సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాల‌మీద‌కు తెచ్చింది. సెల్ఫీ దిగే క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో ప‌డింది. న‌ల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ వ‌ద్ద శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Telangana: వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో పడిన యువతి, తాళ్ల సాయంతో ఆమెను పైకి లాగి కాపాడిన స్థానికులు
young woman fell into Nagarjuna Sagar left Canal while taking a selfie in Nalgonda, locals Save her Life (photo/X/Telangana Awaaz)

నల్గొండ జిల్లాలో సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాల‌మీద‌కు తెచ్చింది. సెల్ఫీ దిగే క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో ప‌డింది. న‌ల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ వ‌ద్ద శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వెంట‌నే స్పందించిన స్థానికులు మ‌హిళ‌ను ప్రాణాల‌తో కాపాడారు. హైద‌రాబాద్ నుంచి మిర్యాల‌గూడ వైపు వెళుతున్న ఓ కుటుంబం వేముల‌ప‌ల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ‌కాలువ వ‌ద్ద ఆగింది. వీడియో ఇదిగో, నూరేళ్ల ఆయుష్షు ఈ తాగుబోతుకు, నడిరోడ్డు మీద కుర్చీలో కూర్చుని ఉండగా వెనక నుంచి ఢీకొట్టిన లారీ, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మందుబాబు

అనంత‌రం ఆ కుటుంబం కాలువ వ‌ద్ద సెల్ఫీ దిగింది. ఈ క్ర‌మంలో ఆ ఫ్యామిలీలోని ఓ మ‌హిళ కాలు జారి కాలువ‌లో ప‌డిపోయింది. అది చూసిన స్థానికులు వెంట‌నే స్పందించి మ‌హిళ‌ను తాళ్ల సాయంతో కాపాడారు. మ‌హిళ సుర‌క్షితంగా పైకి రావ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో కొద్దిసేపు కాలువ వ‌ద్ద ఆందోళనకర వాతావర‌ణం నెల‌కొంది.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 30, 2024 03:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).