Vaddepalli Krishna Dies: టాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
టాలీవుడ్ లో విషాదం కర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ లో విషాదం కర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం ఆయనను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించడం గమనార్హం. ఈ సంతోషకర సమయంలో ఆయన కన్నుమూశారు.
తమిళ నటుడు బిజిలి రమేష్ కన్నుమూత, ప్రాంక్ వీడియోలతో ఫేమస్, కోలీవుడ్‌లో విషాదం
వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. తొలుత పోస్ట్ మేన్ గా ఉద్యోగం చేశారు. దర్శకుడిగా రెండు సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన 'ఎక్కడకి వెళుతుందో మనసు' సినిమాలో సాయికుమార్ హీరోగా నటించారు. 'బలగం' సినిమాలో వడ్డేపల్లి నటించారు. ఆయన రాసిన వందలాది లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా కృష్ణ చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Here's News
ప్రముఖ గేయ రచయిత, సిరిసిల్ల పట్టణానికి చెందిన వడ్డెపల్లి కృష్ణ ఈ ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వడ్డేపల్లి కృష్ణ తెలుగు సినీపరిశ్రమలో రచయితల సంఘానికి విశిష్ట సేవలను అందించారు. వీరు రాసిన లలిత గేయాలు ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం అయ్యాయి.
PTC pic.twitter.com/1IZ2XpE33j
— AIR News Hyderabad (@airnews_hyd) September 6, 2024
ప్రసిద్ధ సినీ గేయకవి, చేనేత సామాజిక వర్గ ఆణిముత్యం డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారి అకాలమరణం తెలుగు సాహిత్యానికి తీరనిలోటు.
ఒకపక్క లలిత గేయాలు, మరోపక్క సినిమా పాటలతో పాటు అనేక నృత్య నాటకాలను రచించిన దిట్ట వారు.
నిత్య చైతన్యశీలి అయిన వడ్డేపల్లి కృష్ణ గారి మరణం అత్యంత… pic.twitter.com/MhHksSOtV2
— P Narahari IAS (@pnarahari) September 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 06, 2024 06:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

