Air India suspends all flights operations to Tel Aviv: ఓ వైపు జ్రాయెల్- హమాస్ యుద్ధం (Israel Hamas conflict), మరోవైపు హెజ్‌బొల్లా, ఇరాన్ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది.ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను (Flights) తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నోటీసులిచ్చేంతవరకు టెల్‌అవీవ్ (Tel Aviv) నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ఇండియా ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో ఆగని ఆందోళనలు, వీసా సెంటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత్, నేడు కొలువుదీరనున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అంతకుముందు ఆగస్టు 2 నుంచి 8వ తేదీ వరకు ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Here's News
In view of the current situation in parts of the Middle East, scheduled operation of our flights to and from Tel Aviv are suspended with immediate effect until further notice. We are continuously monitoring the situation and are offering a full refund to…
— Air India (@airindia) August 9, 2024
(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)