Credits: Twitter

Newdelhi, Dec 31: కజకిస్థాన్‌లోని అల్మాటిలో (Almaty) జరుగుతున్న ఫిడే ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో (World Blitz Championships) తెలుగమ్మాయి కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించింది (Created History). అప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న ప్రత్యర్థులను ఓడించి రజత పతకం (Silver Medal) సాధించింది.

అక్కడ అంతా ఓపెన్ యవ్వారమే.. తలుపులు, గోడలు లేకుండానే మరుగుదొడ్లు.. విచారణకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం

మొత్తం 17 రౌండ్లలో 12.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. తొలి ఐదు గేముల్లో మూడు ఓటములు చవిచూసిన హంపి ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని 12 రౌండ్లలో వరుస విజయాలతో అదరగొట్టింది. నిన్న 8 రౌండ్లు ఆడిన మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారికతో గేమ్‌ను మాత్రమే డ్రా చేసుకున్న హంపి.. మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ విజయాలు సాధించి 7.5 పాయింట్లతో రేసులోకి వచ్చింది.

ప్రయాణికులకు శుభవార్త. మరో 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. నేటి నుంచే రిజర్వేషన్.. ఎక్కడికంటే??

ఆ తర్వాత 16వ రౌండులో షవ్లోనాను ఓడించింది. చివరి రౌండులో తనకన్నా మెరుగైన రేటింగ్ ఉన్న టాన్ జాంగ్‌యీపై విజయం సాధించి రజతం సాధించింది. కేవలం అర పాయింట్‌తో పసిడి పతాకాన్ని కోల్పోయింది. కాగా, విశ్వనాథన్ ఆనంద్ 2017లో ఈ టోర్నీలో పతకం అందుకున్నాడు. ఆ తర్వాత ఈ టోర్నీలో పతకం అందుకున్నది హంపి మాత్రమే.

న్యూ ఇయర్ నేపథ్యంలో నగరంలో ఆంక్షలు.. డ్రంకెన్ డ్రైవ్‌పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. తాగి బండి నడిపితే తొలిసారి రూ. 10 వేల ఫైన్!