Credits: Twitter

Hyderabad, Dec 31: న్యూఇయర్ వేడుకలకు (New Year Celebrations) సిద్ధమయ్యారా? అయితే, ఆగండి. డ్రంకెన్ డ్రైవ్‌లపై (Drunk and Drive) ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) సిద్ధమయ్యారు. తాగి బండి నడిపి పట్టుబడిన వారికి భారీ జరిమానాలు (Heavy Fine) విధించాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ (New Year) వేడుకలకు నగరం ముస్తాబవుతున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు.

అక్కడ అంతా ఓపెన్ యవ్వారమే.. తలుపులు, గోడలు లేకుండానే మరుగుదొడ్లు.. విచారణకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం

ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు రాత్రి 31 నుంచి రేపటి వరకు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్టు ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి బేగంపేట, లంగర్‌హౌస్ తప్ప అన్ని వంతెనలపై నుంచి రాకపోకలను నిషేధించారు. అలాగే, డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు తెలిపారు. తాగి వాహనం నడుపుతూ తొలిసారి పట్టుబడితే రూ. 10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామన్నారు.

ప్రయాణికులకు శుభవార్త. మరో 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. నేటి నుంచే రిజర్వేషన్.. ఎక్కడికంటే??

రెండోసారి పట్టుబడితే రూ. 15 వేలు ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి సస్పెన్షన్‌కు రవాణా శాఖకు పంపుతామన్నారు. మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు రద్దు చేస్తామని, రెండోసారి పట్టుబడితే లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, శిక్షలకు దూరంగా ఉండాలని కోరారు.