Asian Games 2023: అంతర్జాతీయ టీ20ల్లో నేపాల్ కొత్త చరిత్ర, 20 ఓవర్లలో 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసిన పసికూన, విధ్వంసం మాములుగా లేదు మరి..

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో నేపాల్‌ జట్టు చరిత్రను కొత్తగా రాసింది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి నేపాల్‌ 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.

Asian Games 2023: అంతర్జాతీయ టీ20ల్లో నేపాల్ కొత్త చరిత్ర, 20 ఓవర్లలో 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసిన పసికూన, విధ్వంసం మాములుగా లేదు మరి..
Dipendra Singh Airee in action. (Photo- Twitter)

Asian Games Mens T20I 2023- Nepal vs Mongolia: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో నేపాల్‌ జట్టు చరిత్రను కొత్తగా రాసింది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి నేపాల్‌ 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20లలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.2019లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గన్‌ 3 వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచిన మంగోలియా నేపాల్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు కుశాల్‌ భుర్తేల్‌ 19, వికెట్‌ కీపర్‌ ఆసిఫ్‌ షేక్‌ 16 పరుగులకే అవుట్‌ కావడంతో ఆరంభంలోనే నేపాల్‌కు భారీ షాక్‌ తగిలింది. అయితే, వన్‌డౌన్‌లో కుశాల్‌ మల్లా దిగగానే సీన్‌ రివర్స్‌ అయింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపిస్తూ మంగోలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ప్రపంచ కప్‌లో పాల్గొనే 10 దేశాల ఆటగాళ్ల లిస్టు ఇదిగో, టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్న భారత స్క్వాడ్ పై ఓ లుక్కేసుకోండి

19 బంతుల్లో హాఫ్ సెంచరీ, 34 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.దాంతో భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్‌ మిల్లర్ పేరిట ఉన్న 35 బంతుల్లో సెంచరీ రికార్డును కుషాల్‌ మల్లా బద్ధలు కొట్టాడు. ఇప్పుడు అంతర్జాతీయ టీ20ల్లో మల్లా బాదిందే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. మరో ఎండ్ నుంచి రోహిత్ పౌడెల్ 61 (27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులు), దేవేంద్ర సింగ్ ఐరీ (10 బతుల్లో 8 సిక్సులు) కూడా బ్యాట్ ఝలిపించడంతో నేపాల్ 314 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన మంగోలియా 41 పరుగులకే ఆలౌట్‌ కావడంతో నేపాల్‌ ఏకంగా 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్లో ఇదే అతిపెద్ద విజయంగా రికార్డుల్లోకెక్కింది.

(The above story first appeared on LatestLY on Sep 27, 2023 03:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).