DC vs MI IPL 2021: మిశ్రా స్పిన్ మాయాజాలానికి తడబడిన ముంబై, 6 వికెట్ల తేడాతో రోహిత్ సేనను చిత్తు చేసిన పంత్ సేన, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా అమిత్ మిశ్రా
గతేడాది తమకు టైటిల్ దూరం చేసిన ముంబైపై ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో ఢిల్లీ ఒత్తిడిని జయించి రోహిత్‌సేనను ఓడించింది.
గతేడాది తమకు టైటిల్ దూరం చేసిన ముంబైపై ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో ఢిల్లీ ఒత్తిడిని జయించి రోహిత్‌సేనను ఓడించింది. ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన అమిత్ మిశ్రా స్పిన్ మాయాజాలంతో ముంబైని కుప్పకూల్చాడు. శిఖర్ ధవన్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), స్మిత్ (29 బంతుల్లో 4 ఫోర్లతో 33) కీలక ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), సూర్యకుమార్ (15 బంతుల్లో 4 ఫోర్లతో 24) వేగంగా ఆడారు. అవేశ్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. చివర్లో లలిత్ యాదవ్ (25 బంతుల్లో 1 ఫోర్‌తో 22 నాటౌట్), హెట్‌మయెర్ (9 బంతుల్లో 2 ఫోర్లతో 14 నాటౌట్) సంయమనంతో ఆడారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు.
స్కోరుబోర్డు: ముంబై: రోహిత్ (సి) స్మిత్ (బి) మిశ్రా 44; డికాక్ (సి) పంత్ (బి) స్టొయినిస్ 2; సూర్యకుమార్ (సి) పంత్ (బి) అవేశ్ 24; ఇషాన్ (బి) మిశ్రా 26; హార్దిక్ (సి) స్మిత్ (బి) మిశ్రా 0; క్రునాల్ (బి) లలిత్ 1; పొలార్డ్ (ఎల్బీ) మిశ్రా 2; జయంత్ (సి అండ్ బి) రబాడ 23; రాహుల్ చాహర్ (సి)పంత్ (బి) అవేశ్ 6; బుమ్రా (నాటౌట్) 3; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 137/9. వికెట్ల పతనం: 1-9, 2-67, 3-76, 4-77, 5-81, 6-84, 7-123, 8-129, 9-135. బౌలింగ్: స్టొయినిస్ 3-0-20-1; అశ్విన్ 4-0-31-0; రబాడ 3-0-25-1; అమిత్ మిశ్రా 4-0-24-4; అవేశ్ 2-0-15-2; లలిత్ యాదవ్ 4-0-17-1.
ఢిల్లీ: పృథ్వీషా (సి అండ్ బి) జయంత్ 7, ధవన్ (సి) క్రునాల్ (బి) చాహర్ 45, స్టీవెన్ స్మిత్ (ఎల్బీ) పొలార్డ్ 33, లలిత్ (నాటౌట్) 22, పంత్ (సి) క్రునాల్ (బి) బుమ్రా 7, హెట్‌మయెర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19.1 ఓవర్లలో 138/4. వికెట్లపతనం: 1-11, 2-64 3-100, 4-115. బౌలింగ్: బౌల్ట్ 4-0-23-0, జయంత్ 4-0-25-1, బుమ్రా 4-0-32-1, క్రునాల్ పాండ్యా 2-0-17-0, రాహుల్ చాహర్ 4-0-29-1, పొలార్డ్ 1.1-0-9-1.
(The above story first appeared on LatestLY on Apr 21, 2021 12:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

