BBL 2021–22: మీది ఎంత పెద్దదిగా ఉంది, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కి షాకిచ్చిన మహిళా కామెంటేటర్, తేరుకుని నవ్వేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

క్యారమ్‌ బాల్‌ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్‌ బాల్‌ వేయాలంటే .. ఒక బౌలర్‌ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' (How Big Is Yours) అని డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ వచ్చేలా మాట్లాడడంతో (Isa Guha's Ambiguous Query Leaves Adam Gilchrist ) గిల్‌క్రిస్ట్‌ ఒక్కసారిగా నవ్వేశాడు.

BBL 2021–22: మీది ఎంత పెద్దదిగా ఉంది, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కి షాకిచ్చిన మహిళా కామెంటేటర్, తేరుకుని నవ్వేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
How Big Is Yours?' Isa Guha's Ambiguous Query Leaves Adam Gilchrist and Fellow Commentator in Splits

బిగ్‌బాష్‌ లీగ్‌ 2021లో భాగంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్‌ 12న మెల్‌బోర్న్‌ స్టార్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య సీరియస్‌గా మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు , వికెట్ కీపర్ మాజీ కెప్టెన్ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌తో (Adam Gilchrist) పాటు మరో ఇద్దరు కామెంటేటర్స్‌గా వ్యవహరించారు. వీరిలో ఇసా గుహా (Isa Guha) అనే మహిళ కూడా ఉంది. మ్యాచ్‌ సందర్భంగా కామెంటరీ ప్యానెల్‌ మధ్య స్పిన్‌ బౌలింగ్‌లో ఉండే టెక్నిక్స్‌ అంశం చర్చకు వచ్చింది.

క్యారమ్‌ బాల్‌ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్‌ బాల్‌ వేయాలంటే .. ఒక బౌలర్‌ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' (How Big Is Yours) అని డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ వచ్చేలా మాట్లాడడంతో (Isa Guha's Ambiguous Query Leaves Adam Gilchrist ) గిల్‌క్రిస్ట్‌ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇది చూసిన మిగతా టెక్నిషియన్స్‌ కూడా మొదట ఆశ్చర్యపోయినా నవ్వడం షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌తోనే మజాకా''.. అంటూ కొందరు.. ''డబుల్‌ మీనింగ్‌ మరీ ఎక్కువైంది'' అంటూ మరి కొందరు కామెంట్స్‌ తో రక్తి కట్టిస్తున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 14, 2021 06:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).