ICC T20 World Cup 2021 Prize Money: టీ20 వరల్డ్‌కప్ 2021 విన్నర్‌కు రూ.12.02 కోట్లు, రన్నరప్‌కు రూ.6 కోట్లు, లీగ్ మ్యాచ్ గెలిచే టీమ్‌కు రూ.30 లక్షలు, ప్రైజ్‌మనీని ప్రకటించిన ఐసీసీ
యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెన్స్ టీ20 వరల్డ్‌కప్( T20 World Cup) విజేత, రన్నరప్ టీమ్స్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీని (ICC T20 World Cup 2021 Prize Money)ఆదివారం ప్రకటించింది ఐసీసీ.
యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెన్స్ టీ20 వరల్డ్‌కప్( T20 World Cup) విజేత, రన్నరప్ టీమ్స్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీని (ICC T20 World Cup 2021 Prize Money)ఆదివారం ప్రకటించింది ఐసీసీ. విజేతకు 16 లక్షల డాలర్లు (సుమారు రూ.12.02 కోట్లు), రన్నరప్‌కు అందులో సగం అంటే 8 లక్షల డాలర్లు (సుమారు రూ.6 కోట్లు) ఇవ్వనున్నట్లు తెలిపింది. సెమీ ఫైనల్లో ఓటమి పాలైన రెండు జట్లకు చెరో రూ.3 కోట్లు(నాలుగు లక్షల డాలర్లు) వరకు వస్తుంది. ఈ టోర్నీ మొత్తానికి 56 లక్షల డాలర్లు (సుమారు రూ.42.07 కోట్లు) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నారు.
అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే పురుషుల టీ 20 ప్రపంచకప్‌లో 16 జట్లు పాల్గొంటాయి. 2016 వరల్డ్‌కప్ వలె సూపర్ 12 దశలో జట్లు గెలిచిన ప్రతి మ్యాచ్‌కు బోనస్ రూపంలో కొంత మొత్తాన్ని ఐసీసీ ఇవ్వనుంది.సూపర్ 12 దశలో మొత్తం 30 మ్యాచులు జరుగుతాయి. గెలిచిన ప్రతి జట్టుకు మ్యాచుకు రూ.30 లక్షల (40 వేల డాలర్లు) వరకు దక్కనుంది. ఈ రౌండ్ కోసం మొత్తం 12 లక్షల డాలర్లను ఖర్చు పెట్టనున్నట్లు ఐసీసీ మీడియా ప్రకటనలో తెలిపింది. సూపర్ 12 నుంచి ఇంటిముఖం పట్టే జట్లకు 70వేల డాలర్లను ఐసీసీ అందజేయనుంది. దీని కోసం ఐసీసీ మొత్తంగా 560000 డాలర్లను ఖర్చు చేయనుంది. ఇక రౌండ్ వన్‌లో గెలిచిన ఒక్కో జట్టుకి రూ.30 లక్షలు (40 వేల డాలర్లు) దక్కుతాయి.
ఇందుకు గాను మొత్తం 4,80,000 డాలర్లను ఐసీసీ కేటాయించింది. ఇదే రౌండ్లో వెనుదిరిగిన ఒక్కో జట్టుకు 40వేల డాలర్లను అందజేస్తారు. నమీబియా, నెదర్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఓమన్, పపువా న్యూ గియా, స్కాట్లాండ్, శ్రీలంక జట్లు రౌండ్ వన్‌లో పోటీ పడబోతున్నాయి. ఇక సూపర్ 12లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడనున్నాయి.
(The above story first appeared on LatestLY on Oct 10, 2021 07:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

