World Cup 2023: భారత్‌పై ఘోర ఓటమితో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం, మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన క్రీడల మంత్రిత్వ శాఖ

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023)భారత్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి మధ్యంతర బోర్డును ఏర్పాటు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

World Cup 2023: భారత్‌పై ఘోర ఓటమితో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం, మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన క్రీడల మంత్రిత్వ శాఖ
Sri Lanka Sack Entire Cricket Board Over World Cup Humiliation Against India

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023)భారత్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి మధ్యంతర బోర్డును ఏర్పాటు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

వరల్డ్ కప్ టోర్నీలో తమ జట్టు ప్రదర్శనపై శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల భారత్ తో జరిగిన మ్యాచ్ లో అవమానకర రీతిలో ఓడిపోవడంపై సీరియస్ అయ్యారు. మొత్తం బోర్డునే తొలగిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇక 1996 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు నేతృత్వం వహించిన అర్జున రణతుంగను ఈ తాత్కాలిక బోర్డు కమిటీకి చైర్మన్ గా నియమించారు. ఈ ప్యానెల్ లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ సహా ఏడుగురు సభ్యులను నియమించారు.

నిప్పులు చెరిగిన మొహమ్మద్ షమీ, ఘోర పరాజయం పాలైన శ్రీలంక, సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్న టీమిండియా

ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఘోర వైఫల్యం తర్వాత మంత్రి రోషన్ రణసింఘె క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు. శ్రీలంక క్రికెట్ బోర్డ్ అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు. బోర్డ్ ప్రెసిడెంట్ తో పాటు సభ్యులకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. వరల్డ్ కప్ టోర్నీలో జట్టు వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా బోర్డు మొత్తాన్ని తొలగిస్తూ మంత్రి రోషన్ రణసింఘె ఉత్తర్వులు జారీ చేశారు.

(The above story first appeared on LatestLY on Nov 06, 2023 12:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).