India vs England 2nd Test 2021: భారత్ భారీ విజయం, రెండో టెస్టులో చిత్తయిన ఇంగ్లండ్, 317 పరుగుల భారీ విజయంతో తొలి టెస్ట్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం (IND Beat ENG) సాధించింది. ఇదే స్టేడియంలో తొలి టెస్ట్‌లో ఎదురైన దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.
చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం (IND Beat ENG) సాధించింది. ఇదే స్టేడియంలో తొలి టెస్ట్‌లో ఎదురైన దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. స్పిన్ పిచ్‌పై ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన టీమిండియా స్పిన్నర్లు.. 317 పరుగుల భారీ విజయాన్ని (India vs England 2nd Test 2021) అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే చాప చుట్టేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో చివర్లో మెరుపులు మెరిపించిన మోయిన్ అలీ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
ఇదిలా ఉంటే అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించిన 6వ బౌలర్‌గా అక్షర్ పటేల్ ఘనత సాధించాడు. చెన్నై రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఓపెపర్ శుభ్‌మన్ గిల్ ఎడమ మోచేతికి గాయమైంది. మూడోరోజు ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా గిల్ ఎడమ మోచేతికి వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ నేపథ్యంలో గాయం కారణంగా గిల్ ఈరోజు ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్యుల బృందం అతడిని పర్యవేక్షించాడు.
చెన్నైలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి దూసుకెళ్లింది. చెన్నైలో ఇంగ్లండ్ పై గెలిచి 4 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసిన కోహ్లీ సేన వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి పడిపోయింది.
కాగా, టెస్టు చాంపియన్ షిప్ జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. మరో బెర్తు కోసం భారత్, ఇంగ్లండ్ మధ్య గట్టిపోటీ నెలకొంది. భారత్ జట్టు ఈ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే సిరీస్ లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది.
ఇంగ్లండ్ కు కూడా ఇదే సమీకరణం వర్తిస్తుంది. ఈ సిరీస్ ను టీమిండియా గానీ, ఇంగ్లండ్ గానీ 3-1 తేడాతో గెలిస్తే, గెలిచిన జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడుతుంది. అలా కాకుండా 2-2తో గానీ, 1-1తో గానీ సిరీస్ సమం అయినా, 2-1తో ఇంగ్లండ్ గెలిచినా... భారత్, ఇంగ్లండ్ జట్లలో ఏ ఒక్కటీ ఫైనల్ చేరకపోగా.... ఫైనల్లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా ఆడుతుంది.
(The above story first appeared on LatestLY on Feb 16, 2021 12:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

